ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా కీలక ముందడుగు పడింది. మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ సమీపంలో, మంగళగిరి – కృష్ణా కాలువ రైల్వే స్టేషన్లను అనుసంధానించే ఆరు లైన్ రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ (ఆర్ఓబీ) నిర్మాణానికి రైల్వే శాఖ అనుమతి మంజూరు చేసింది. దీని ఖర్చు సుమారు రూ.112 కోట్లుగా ఉంది.
ఈ ఆర్ఓబీ జాతీయ రహదారి నుంచి అమరావతి రాజధాని ప్రాంతంలోని 13 ప్రధాన రహదారులను నేరుగా అనుసంధానిస్తుంది. భవిష్యత్తు ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆరు లైన్ ఆర్ఓబీ నిర్మాణానికి రైల్వే శాఖ అంగీకారం తెలిపింది. ఇది కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రతిపాదన మేరకు కేంద్రం ఆమోదం పొందింది.
ఆర్ఓబీ పూర్తి అయిన తర్వాత, ట్రాఫిక్ జాములు తగ్గి ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం లభించడమే కాక, మంగళగిరి మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రాజధానికి రాకపోకలు వేగవంతమవుతాయని భావిస్తున్నారు.