హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో పార్కింగ్ కోసం కొత్త సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశం

కేబీఆర్ పార్క్ వద్ద ఆధునిక మల్టీ లెవెల్ పార్కింగ్ సదుపాయం ప్రారంభం
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద వాహనాల పార్కింగ్ సమస్యలను తగ్గించేందుకు ఆధునిక టెక్నాలజీతో కూడిన మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. 400 గజాల స్థలంలో నిర్మించిన ఈ పార్కింగ్ ప్రదేశంలో ఒకేసారి 72 కార్లు నిలుపుదల చేయవచ్చు. ప్రస్తుతం ఇది పది రోజుల ట్రయల్ రన్‌లో కొనసాగుతోంది. అనంతరం ఇది ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి రానుంది.

రోజు ఉదయం మరియు సాయంత్రం సమయాల్లో కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. వాకింగ్‌కు వచ్చే ప్రజలు పార్కింగ్ స్థానాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు కొరియన్ సాంకేతికతతో ఈ మల్టీ లెవెల్ పార్కింగ్‌ను GHMC అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ ప్రాజెక్టు కోసం రూ.6 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లోని పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలను తగ్గించడమే లక్ష్యంగా ఇది రూపొందించబడింది. ఈ విధానం విజయవంతమైతే, నగరంలోని ఇతర రద్దీ ప్రాంతాల్లోనూ ఇలాంటి పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని GHMC యోచిస్తోంది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book