ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ సీజన్ మళ్లీ మే 17 నుంచి ప్రారంభం కానుంది. షెడ్యూల్‌లో మార్పులు రావడంతో, మునుపే టికెట్లు కొనుగోలు చేసిన అభిమానుల్లో గందరగోళం నెలకొంది.
ఈ నేపథ్యంలో, ఫ్రాంచైజీలు స్పష్టతనిచ్చాయి. ఇప్పటికే టికెట్లు కొన్న వారు రీఫండ్ పొందవచ్చు లేదా నూతన తేదీలకు అదే టికెట్‌తో స్టేడియానికి ప్రవేశించవచ్చు అని స్పష్టం చేశారు.
లీగ్ మళ్లీ మే 17న RCB vs KKR మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. అంతేకాక, మే 23న RCB vs SRH మ్యాచ్ జరగనుంది. ఇది మొదట మే 13న జరగాల్సిన మ్యాచ్ కాగా, భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా లీగ్‌ను వారం వాయిదా వేశారు.
ఈ మార్పుల నేపథ్యంలో, RCB అధికారికంగా X (ట్విటర్) ద్వారా ప్రకటన చేసింది. M. చినస్వామి స్టేడియంలో మ్యాచ్‌కు టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులు అదే టికెట్‌తో స్టేడియానికి ఎంట్రీ పొందవచ్చని వారు స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో అభిమానుల్లో ఉద్విగ్నత తొలిగింది.