ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్ 2025 – 1,266 ట్రేడ్స్‌మెన్ స్కిల్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత నౌకాదళం (Indian Navy) గ్రూప్ ‘సి’, నాన్ గెజిటెడ్, ఇండస్ట్రియల్ – ట్రేడ్స్‌మెన్ స్కిల్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1,266 ఖాళీలు భర్తీ చేయనున్నారు. అయితే ఈ పోస్టులకు ఇండియన్ నేవీలో వివిధ యూనిట్లలో శిక్షణ పొందిన ఎక్స్ నేవల్ (యార్డ్ అప్రెంటిస్ స్కూల్స్ ఆఫ్ ఇండియన్ నేవీ) అప్రెంటిస్ అభ్యర్థులు మాత్రమే అర్హులు.
ట్రేడ్స్‌మెన్ స్కిల్డ్ (ఎక్స్ నేవల్ అప్రెంటిస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సివిల్ వర్క్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ గైరో, ఫౌండ్రీ, హీట్ ఇంజిన్, ఇన్‌స్ట్రుమెంట్, మెషిన్ వంటి ట్రేడ్స్‌లో ఏదో ఒకదానిలో అప్రెంటిస్ ట్రైనింగ్ పూర్తిచేసి సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అలాగే పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి 18 నుండి 25 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తులు ఆన్‌లైన్‌లో స్వీకరించబడతాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2025 సెప్టెంబర్ 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు ₹19,000 నుండి ₹63,200 వరకు జీతం మరియు ఇతర అలవెన్సులు లభిస్తాయి. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక నేవీ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.