S-400: రష్యా నుంచి మరో రెండు క్షిపణి వ్యవస్థలు కొనుగోలు చేయనున్న భారత్
భారత ప్రభుత్వం రష్యా నుంచి మరో రెండు ఎస్-400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ వ్యవస్థలు భారత రక్షణ సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
2018లో 5.43 బిలియన్ డాలర్ల ఒప్పందం కింద ఐదు ఎస్-400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయగా, ప్రస్తుతం మిగిలిన రెండు వ్యవస్థల డెలివరీ వాయిదా పడింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇది ఆలస్యమైంది.
ఇటీవల భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్‌ల మధ్య జరిగిన చర్చల్లో, మిగిలిన వ్యవస్థలను 2026-27 నాటికి అందజేయమని హామీ ఇచ్చారు.
అలాగే, భారత్ సుమారు 260 సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ జెట్‌లను అప్‌గ్రేడ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తోంది. ఈ అప్‌గ్రేడ్‌తో వీటి యుద్ధ సామర్థ్యం మరింత మెరుగుపడుతుంది.
రష్యా, భారత్ రక్షణ రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్చలు సాగుతున్నాయి.