డాలర్ విలువ పెరిగే కొద్దీ బంగారం ధర తగ్గుతుందని సాధారణంగా భావిస్తారు. కానీ తాజాగా అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచడంతో పాటు ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతుండటంతో పెట్టుబడిదారులు మళ్లీ బంగారంపైనే దృష్టి సారిస్తున్నారు.
గతంలో తులం బంగారం ధర ₹1.30 లక్షల వరకు పెరిగింది. ఆ తర్వాత ₹1.20 లక్షల కంటే దిగువకు తగ్గింది. అయితే ఇప్పుడు మెల్లగా పెరుగుదల మళ్లీ ప్రారంభమైంది. గత మూడు రోజుల్లో సుమారు ₹2,000 పెరిగి ప్రస్తుతం నవంబర్ 12న దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం తులం ధర ₹1,25,850గా ఉంది.