GMC రంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు – మొత్తం 63 పోస్టులు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 63 పోస్టుల భర్తీకి ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ, డిప్లొమా, టెన్త్, ఐటీఐ, ఎంఎల్‌టీ అర్హత గల అభ్యర్థులు మే 10, 2025 వరకు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
-
ల్యాబ్ అటెండెంట్ – 13
-
రిఫ్రాక్షనిస్ట్/ఆప్టీషియన్ – 1
-
రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ – 4
-
ఓటీ టెక్నీషియన్ – 4
-
అనస్థీషియా టెక్నీషియన్ – 4
-
డెంటల్ టెక్నీషియన్ – 1
-
బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ – 4
-
రికార్డ్ క్లర్క్/అసిస్టెంట్ – 1
-
కాటలొగర్ – 1
-
మ్యూసియం అసిస్టెంట్ కమ్ ఆర్టిస్ట్ – 1
-
ఆడియో విజువల్ టెక్నీషియన్ – 1
-
వార్డ్ బాయ్ – 4
-
దోబి/ప్యాకర్స్ – 3
-
కార్పెంటర్ – 1
-
బార్బర్ – 3
-
టైలర్ – 1
-
ఎలక్ట్రిషియన్ – 3
-
ప్లంబర్ – 2
-
థియేటర్ అసిస్టెంట్ – 6
-
గ్యాస్ ఆపరేటర్ – 2
-
ఈసీజీ టెక్నీషియన్ – 3
అభ్యర్థులు సంబంధిత విభాగంలో అర్హతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. వయస్సు 18 నుంచి 46 ఏళ్ల మధ్య ఉండాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి రూ.15,600 నుండి రూ.22,750 వరకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు పంపవలసిన చిరునామా:
ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్, ప్రభుత్వ వైద్య కళాశాల, మహేశ్వరం, బీఐఈటీ క్యాంపస్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా.