Global Star RamCharan BirthDay Celebrations | Global Star Ram Charan | IRC | Mana Voice

Global Star RamCharan BirthDay Celebrations | Global Star Ram Charan | IRC | Mana Voice 

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా తెరంగేట్రం చేసి.. మెగాపవర్ స్టార్ గా ఎదిగి.. నేడు గ్లోబల్ స్టార్ గా తన కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసుకున్న శ్రీ కొణిదెల రామ్ చరణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అఖిల బారత చిరంజీవి యువత శ్రీకారం చుడుతోందని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాం. 

మార్చి 27న శ్రీ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా 100 రోజుల ముందు నుంచే మెగా సంబరాలు అంబరాన్నంటేలా జరిపేందుకు అభిమానులుగా ముందడుగు వేస్తున్నాం.

వేసవి కాలంలో తాగునీటికి ఇబ్బంది ఉండే ప్రాంతాల్లో ఉచితంగా మంచినీరు అందించడం.. 

రక్తదాన శిబిరాలు నిర్వహణ.. 

పేద మహిళలకు చీరల పంపిణి.. 

ఇంకా అనేక సమాజహితం కోరే కార్యక్రమాలు చేయడానికి సంకల్పించాం. 

శ్రీ రామ్ చరణ్ గారు తన సినీ కెరీర్లో అంచెలంచెలుగా ఎదిగి.. తెలుగు సినిమా ఖ్యాతిని ఆస్కార్ వరకూ తీసుకెళ్లడం మనకు గర్వకారణం. 

వ్యక్తిగతంగా కూడా శ్రీ రామ్ చరణ్ గారు మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని మనసారా కోరుకుంటూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యువతగా మరిన్ని ఉన్నతమైన కార్యక్రమాల నిర్వహణకు సర్వసన్నద్ధులయ్యామని తెలియజేస్తున్నాం.

గ్లోబల్ స్టార్ రాంచరణ్ యువత 
అఖిల భారత చిరంజీవి యువత

 


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book