FASTag వార్షిక పాస్ మొదటి రోజే 1.4 లక్షల యాక్టివేషన్లు, 1.39 లక్షల ట్రాన్సాక్షన్లు

NHAI FASTag వార్షిక పాస్ కు విపరీత స్పందన: మొదటి రోజే 1.4 లక్షల యాక్టివేషన్లు

న్యూఢిల్లీ, ఆగస్టు 16:
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు మరియు ఎక్స్‌ప్రెస్‌వేలపై సుమారు 1,150 టోల్ ప్లాజాల వద్ద FASTag వార్షిక పాస్ సౌకర్యాన్ని జాతీయ రహదారుల అథారిటీ (NHAI) ప్రారంభించింది.

ప్రథమ రోజే ఈ పాస్‌కు విపరీతమైన స్పందన లభించింది. ఆగస్టు 15 సాయంత్రం 7 గంటల వరకు 1.4 లక్షల మంది యూజర్లు పాస్ కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నారు. అదే రోజున 1.39 లక్షల టోల్ లావాదేవీలు కూడా నమోదయ్యాయి.

ప్రస్తుతం రాజ్మార్గయాత్ర యాప్‌లో ఒకేసారి 20,000–25,000 మంది యూజర్లు యాక్టివ్‌గా ఉన్నారు. వార్షిక పాస్ యూజర్లకు టోల్ ఫీజు కోత లేకుండా SMS నోటిఫికేషన్లు పంపబడుతున్నాయి.

ప్రయాణికులకు సులభంగా ప్రయాణం కల్పించేందుకు ప్రతి టోల్ ప్లాజా వద్ద అధికారులను నియమించగా, ఫిర్యాదుల పరిష్కారానికి 1033 నంబర్ నేషనల్ హైవే హెల్ప్‌లైన్‌లో మరో 100 మందికి పైగా ఎగ్జిక్యూటివ్‌లను కూడా నియమించారు.

FASTag వార్షిక పాస్ తో నాన్-కమర్షియల్ వాహన యజమానులు ఒకసారి మాత్రమే ₹3,000 చెల్లించి, ఒక సంవత్సరం పాటు లేదా 200 టోల్ ప్లాజాల వరకు ఉచిత ప్రయాణం పొందవచ్చు. ఈ పాస్ రాజ్మార్గయాత్ర యాప్ లేదా NHAI వెబ్‌సైట్ ద్వారా చెల్లింపు చేసిన రెండు గంటల్లోనే యాక్టివేట్ అవుతుంది.

ప్రస్తుతం 98% వినియోగం, 8 కోట్లకు పైగా యూజర్లతో, FASTag దేశంలో టోల్ కలెక్షన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. కొత్తగా ప్రవేశపెట్టిన వార్షిక పాస్ సౌకర్యం ప్రయాణికులకు మరింత ఆర్థికంగా, సౌకర్యవంతంగా మారుస్తుందని NHAI ప్రకటించింది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book