గ్రాండ్ చెస్ టూర్ 2025 ర్యాపిడ్ టోర్నీలో కార్ల్‌సన్‌పై గుకేశ్ గెలుపు – బలమైన సమాధానం
భారత యువ గ్రాండ్‌మాస్టర్ డి. గుకేశ్ తన ఆటతో చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్‌కు గట్టి సమాధానం ఇచ్చాడు. కార్ల్‌సన్ తనను 'బలహీన ఆటగాడు' అని వ్యాఖ్యానించగా, గుకేశ్ తన అద్భుత ఆటతీరుతో ఈ వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చాడు. క్రొయేషియాలో జరుగుతున్న గ్రాండ్ చెస్ టూర్ సూపర్ యునైటెడ్ ర్యాపిడ్ 2025 టోర్నీలో గురువారం జరిగిన ఆరో రౌండ్‌లో నల్లపావులతో ఆడి కార్ల్‌సన్‌ను ఓడించాడు.
ఈ గెలుపుతో గుకేశ్ టోర్నీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరాడు. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు కార్ల్‌సన్ గుకేశ్‌పై చేసిన వ్యాఖ్యలు ఈ గెలుపుకు ప్రాధాన్యతను కల్పించాయి. "ఈ స్థాయి టోర్నీల్లో గుకేశ్ తనను నిరూపించలేదు, అతడిని బలహీన ఆటగాళ్లలో ఒకరిగా భావిస్తున్నా" అని కార్ల్‌సన్ అన్నాడు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలపై గుకేశ్ ఆటతో సమాధానం ఇచ్చాడు.
ఈ టోర్నీలో గుకేశ్‌కు ఇది వరుసగా ఐదవ విజయం. రెండో రోజు ఆటలో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన అబ్దుసత్తరోవ్, అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ కరువానాపై కూడా గెలిచాడు. మొదటి మ్యాచ్‌లో ఓడినప్పటికీ, ఆ తర్వాత మంచి పుంజుకుంటూ విజయాల పరంపర కొనసాగిస్తున్నాడు.