విశాఖపట్నంలో కాగ్నిజెంట్ ఐటీ క్యాంపస్ – 8,000 ఉద్యోగాలు వచ్చేనున్నాయి
విశాఖపట్నం ఐటీ రంగంలో కీలక ముందడుగు వేయబోతోంది. ప్రముఖ టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్, నగరంలో కొత్త ఐటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రాజెక్టుతో వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది.
విశాఖపట్నం కాపులుప్పాడ ప్రాంతంలో కాగ్నిజెంట్ సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక వసతులతో క్యాంపస్‌ను నిర్మించనుంది. ఈ కేంద్రం ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సేవలపై దృష్టి పెట్టనుంది అని కంపెనీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.
ఈ కొత్త క్యాంపస్‌ను 2026 నుండి ప్రారంభించేందుకు కంపెనీ ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రంలో ఈ ప్రాజెక్టుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్లకు కాగ్నిజెంట్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ప్రాజెక్ట్ విశాఖ ఐటీ అభివృద్ధికి బలమిచ్చి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతుంది.