బ్రహ్మోస్ దాడులతో వణికిన పాక్
భారత్ పాకిస్థాన్ సైనిక స్థావరాలపై తీవ్ర దాడులు చేసి, పెద్ద నష్టం కలిగించింది. భారత్, రష్యా కలిసి అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ మిసైల్ ప్రపంచంలోనే శక్తివంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్‌గా ప్రఖ్యాతి గడిచింది. శనివారం ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్థాన్‌కు తీవ్రమైన నష్టం జరిగినట్లు సమాచారం. పాక్ కు చెందిన దాదాపు పది వైమానిక స్థావరాలు భారత్ దాడి చేసింది. ఈ దాడుల్లో భారత్ హ్యామర్ గైడెడ్ బాంబులు, స్కాల్ప్ క్షిపణులు, బ్రహ్మోస్ మిసైల్ ఉపయోగించినట్లు తెలియడం వలన, పాక్ వైమానిక స్థావరాలు తీవ్రమైన ధ్వంసానికి గురయ్యాయి.
భారత్ ఈ దాడి గురించి అధికారికంగా ధ్రువీకరించకపోయినా, జాతీయ మీడియా కథనాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. బ్రహ్మోస్ క్షిపణి ఇది యుద్ధరంగంలో ఉపయోగించిన మొదటి సారి కావచ్చని తెలుస్తోంది. పాకిస్థాన్ హర్యానాలోని సిర్సాపై బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించడంతో, భారత్ తన అత్యాధునిక ఆయుధాలతో పాకిస్థాన్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది.
పాకిస్థాన్ అధికారిక రాజధాని ఇస్లామాబాద్ అయినప్పటికీ, రావల్పిండి నుండి ఆదేశాలు వెళ్ళాయి. శనివారం తెల్లవారుజామున, భారత్ రావల్పిండిలోని చక్లాలా ఆర్మీ చీఫ్ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ దాడిలో పాక్ వాయుసేనకు చెందిన పరికరాలకు తీవ్ర నష్టం జరిగిందని తెలుస్తోంది. నూకాన్, సర్గోడా, రఫీ వంటి స్థావరాలకు కూడా భారత్ దాడి చేసింది. ఈ దాడుల్లో వైమానిక స్థావరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, రాడార్ సైట్లు, ఆయుధ నిల్వ కేంద్రాలు ధ్వంసమయ్యాయి.