ఏటీఎం ఛార్జీలు పెంపు: బిగ్ అలర్ట్! నేటి నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి

మే 1 నుంచి ఏటీఎం ఛార్జీలు పెంపు – ఆర్‌బీఐ ఆమోదం


మే 1, 2025 నుంచి బ్యాంకులు ఏటీఎం విత్‌డ్రా ఛార్జీలను పెంచాయి. ఉచిత లావాదేవీల లిమిట్‌ దాటితే ఇప్పుడు ఒక్క లావాదేవీకి ₹21 బదులు ₹23 ఛార్జ్ చేయనున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దీనికి అనుమతి ఇచ్చింది.

మెట్రో నగరాల్లో నెలకు 3, నాన్ మెట్రోల్లో 5 ఉచిత ATM లావాదేవీలు మాత్రమే చేయవచ్చు. ఆ తర్వాత చేసే ప్రతి విత్‌డ్రా కోసం పెరిగిన ఛార్జీ వర్తిస్తుంది. RBI తెలిపిన ప్రకారం, ఏటీఎం నిర్వహణ ఖర్చులు, భద్రతా వ్యవస్థలపై వ్యయం పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ATM ఇంటర్‌చేంజ్ ఛార్జీలు అంటే ఒక బ్యాంకు కస్టమర్‌ మరొక బ్యాంకు ATM వాడినప్పుడు, ఆ రెండు బ్యాంకుల మధ్య లావాదేవీ ఛార్జీలు. ప్రస్తుతం ఇది ఆర్థిక లావాదేవీలకు ₹19 మరియు ఆర్థికేతర లావాదేవీలకు ₹7 గా ఉంది. కస్టమర్లు ఇకపై ATM వాడేటప్పుడు లావాదేవీల సంఖ్యను గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలి.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens