ఏపీ సెట్స్ 2025 పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈసెట్, ఐసెట్, ఈఏపీసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీజీఈసెట్, పీజీసెట్ వంటి పలు ప్రవేశ పరీక్షలు మే, జూన్ నెలల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే APSCHE హాల్‌టికెట్లు విడుదల చేయనుంది.
మే 4న ఉన్నత విద్యామండలి అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూల్‌ను విడుదల చేసింది. తాజా ప్రకారం అన్ని పరీక్షలు ఆన్‌లైన్ షిఫ్టులలో జరుగనున్నాయి. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్ మరియు ఆధార్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ వంటి ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తీసుకెళ్లాలి. అలాగే బ్లాక్ లేదా బ్లూ పెన్ కూడా తీసుకెళ్లవచ్చు. పరీక్షల కోసం అవసరమైన మార్గదర్శకాలను APSCHE ఇప్పటికే విడుదల చేసింది.
AP CETs 2025 పరీక్షల తేదీలు ఇవే:
-
మే 6 – ఈసెట్ 2025
-
మే 7 – ఐసెట్ 2025
-
మే 19 నుంచి 27 వరకు – ఈఏపీసెట్ 2025
-
జూన్ 5 – లాసెట్, ఎడ్‌సెట్ 2025
-
జూన్ 6 నుంచి 8 వరకు – పీజీఈసెట్ 2025
-
జూన్ 9 నుంచి 13 వరకు – పీజీసెట్ 2025
పదో తరగతి ఫెయిల్ అయిన వారికి స్పెషల్ క్లాసులు
పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో మెరుగైన ఫలితాల కోసం ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ కోచింగ్ క్లాసులు ప్రారంభించనుంది విద్యాశాఖ. ఈ మే నెలకు సంబంధించి ప్రణాళికను విడుదల చేశారు. మే 19 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. కాబట్టి మే 18 వరకు స్పెషల్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. మండల కేంద్రాల్లో కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, సాధ్యం కానప్పుడు ఆయా పాఠశాలలోనే తరగతులు నిర్వహించాలని అధికారులు సూచించారు.