ఓ రాగం ..ఒక కాలం
రాగం రానంటుంది ...కాలం ఆగనంటుంది
ఎంత లాగినా రాని రాగం
ఎంత పట్టుకుందామనకున్న దొరకని కాలం
చివరికి ఏమి చెప్పాయి అంటే
రాగం అంటోంది
నేను అంత తేలికగా ఊహకందను అని
ఇక కాలం ఐతే
నువ్వు ఏడు తరాలు వెనక్కి వెళ్లినా
ఏడు సముద్రాలు ఈదుకుంటూ వచ్చినా
నేను ఆగను...వెనక్కి రాను అని
కాబట్టి ఆశ పడొద్దు ....
అత్యాశతో నిరాశ చెందొద్దు