tics Telangana

తెలంగాణలో 12,452 పోలీసు ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

  • పోలీసు శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు
  • మొత్తం 12,452 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తింపు
  • అత్యధికంగా సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 8,442
  • ప్రభుత్వానికి ఖాళీల వివరాలు సమర్పించిన పోలీస్ శాఖ

తెలంగాణలోని నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పోలీస్ శాఖలో భారీ సంఖ్యలో ఖాళీలను భర్తీ చేసేందుకు వేగంగా కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీలలో కలిపి మొత్తం 12,452 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు పోలీస్ శాఖ తమ విభాగంలోని ఖాళీల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.

పోలీస్ ఉన్నతాధికారులు ఆర్థిక శాఖకు అందించిన నివేదిక ప్రకారం, రాష్ట్రంలో ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వీటిలో అత్యధికంగా సివిల్ పోలీస్ కానిస్టేబుల్ 8,442, ఆర్మ్‌డ్ రిజర్వ్ (AR) కానిస్టేబుల్ 3,271 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న యువతకు ఇది గొప్ప అవకాశంగా మారనుంది.

కానిస్టేబుల్ పోస్టులతో పాటు సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) స్థాయి ఉద్యోగాలు కూడా గణనీయంగా ఉన్నాయి. సివిల్ ఎస్సై 677, ఏఆర్ ఎస్సై 40, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ (TSP) విభాగంలో 22 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని నివేదిక పేర్కొంది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు ఈ నియామక ప్రక్రియను వేగవంతం చేస్తోంది. త్వరలో అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book