ucation_Jobs

ఏపీ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు 2025: మరో వారంలో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు.. హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్ ఇక్కడ!

ఏపీ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2025 మరొక వారం రోజులలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యా శాఖ హాల్ టికెట్లు విడుదల చేసింది. సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ లేదా మనమిత్ర వాట్సప్‌ గ్రూప్ ద్వారా నేరుగా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అమరావతి, మే 13: ఆంధ్రప్రదేశ్‌ 10వ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో పాఠశాల విద్యా శాఖ హాల్ టికెట్లు విడుదల చేసింది. సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ లేదా మనమిత్ర వాట్సప్‌ 95523 00009 నుండి నేరుగా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్లు విద్యార్థులు చదువుతున్న పాఠశాల ప్రిన్సిపల్ లేదా హెడ్‌ మాస్టర్ నుండి కూడా పొందవచ్చు. రెగ్యులర్‌ విద్యార్థులతో పాటు ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసి హాల్ టికెట్లు పొందవచ్చు. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా మే 19 నుండి 28వ తేదీ వరకు జరగనున్నట్లు ఇప్పటికే షెడ్యూల్‌ విడుదలైంది. ఈ పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరగనున్నాయి. 2023 మార్చి 18 నుండి 30 వరకు టెన్త్‌ క్లాస్ పబ్లిక్‌ పరీక్షలు జరిగాయి.

ఈ ఏడాది టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాల్లో 81.14% ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 6,14,459 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు, వారిలో 4,98,585 మంది ఉత్తీర్ణత సాధించారు. పార్వతీపురం మన్యం జిల్లా 93.90% ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచింది, అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానం పొందింది.

2025 పదో సప్లిమెంటరీ పరీక్షల పూర్తి టైం టేబుల్:

  • మే 19: ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1

  • మే 20: సెకండ్ లాంగ్వేజ్

  • మే 21: ఇంగ్లీష్

  • మే 22: గణితం

  • మే 23: భౌతిక శాస్త్రం

  • మే 24: జీవ శాస్త్రం

  • మే 26: సామాజిక అధ్యయనాలు

  • మే 27: ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2, OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ I

  • మే 28: OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2, SSC ఒకేషనల్ కోర్సు


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens