వక్ఫ్ సవరణ చట్టంపై హీరో విజయ్ సుప్రీంకోర్టులో పిటిషన్

వక్ఫ్ సవరణ చట్టంపై న్యాయపోరాటానికి విజయ్ ముందుకు

ప్రముఖ తమిళ నటుడు, టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ వక్ఫ్ సవరణ చట్టం – 2025 రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతేడాది అక్టోబర్‌లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి, ఇప్పుడు కీలక చట్టంపై చొరవ చూపుతున్నారు.

ఈ అంశంపై ఇప్పటికే కాంగ్రెస్, ఎంఐఎం నేతలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించగా, తాజాగా విజయ్ కూడా ఈ జాబితాలో చేరారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవి విశ్వనాథ్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఏప్రిల్ 16న విచారణ చేపట్టనుంది.

మొదట ఈ కేసును ఏప్రిల్ 15న వినిచాలని భావించిన ధర్మాసనం, కేంద్ర ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసిన నేపథ్యంలో విచారణను ఏప్రిల్ 16కి మార్చింది. ఇప్పటికే పదికి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. మరిన్ని కూడా ధర్మాసనం ముందుకు రానున్నాయి.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book