valuable Friendship

 

స్నేహం అనేది ఒక అందమైన రహదారి లాంటిది. రహదారి మీద మనము వెళ్ళే కొద్ది మనకు కొత్త కొత్త చెట్లు ఎలా కనిపిస్తాయో , అలాగే మన జీవితంలో కూడా మనము ముందుకు వెళ్ళే కొద్ది కొత్త కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. మన స్నేహితుల్లో చిన్న నాటి స్నేహితులు, మరియు మనము చదువుకున్న కళాశాలో స్నేహితులు ఎక్కువుగా ఉంటారు. అన్ని బంధాలలో చాలా గట్టి బంధం ” స్నేహ బంధం ” . మనము ఒక్కసారి చేయి పట్టుకుంటే అంత సామాన్యంగా విడిచిపెట్టలేము. అది స్నేహానికి ఉన్న శక్తి. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి యొక్క మనిషికి స్నేహితులు ఉంటారు. అసలు స్నేహితులు లేకుండా ఎవరు ఉండరు. కొంతమంది ఇంట్లో చెప్పుకోలేని బాధలు కూడా స్నేహితులు దగ్గర చెప్పుకుంటారు. అలా చెప్పుకుంటున్నారంటే మీరు మంచి స్నేహితులను పొందినట్లే .


మనము బాధ పడే కొద్ది బాధలే వస్తాయి. అలా కాకుండా మీరు మీ స్నేహితులతో పంచుకుంటే కొంచం ఐనా తగ్గుతాయి. బాధలు లేని మనుషులే ఉండరు. బాధలు అన్నాక మనుషులకే వస్తాయి. అంత మాత్రాన మీరు బాధ పడకండి . ఆ దేవుడు బాధలను పంచుకోమనే స్నేహితులను ఇచ్చాడు. నమ్మకంగా ఉన్న వారి దగ్గర ఏమైనా చెప్పుకోవచ్చు. అపనమ్మకం ఉన్న చోట ఏమి చెప్పినా మనల్ని పిచ్చి వాళ్ళను చేస్తారు.
మన ప్రేమ వారికి పిచ్చి లాగా కనిపిస్తుంది . వాళ్ళు మిమ్మల్ని పిచ్చి వాళ్ళలాగా చూసిన అసలు బాధ పడకండి . ఎదో ఒక రోజు మీ విలువ వాళ్లే తెలుసుకుంటారు. మనము తలచుకుంటే డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ మంచి స్నేహితులను సంపాదించుకోలేము. మంచి మనసుతో మాత్రమే సంపాదించుకోగలము.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book