TS ECET 2025 టాపర్స్ లిస్ట్: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్ చెక్ చేసుకునే డైరెక్ట్ లింక్ ఇదే!

TS ECET 2025 ఫలితాలు విడుదల – టాపర్స్ లిస్ట్, రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇక్కడ

హైదరాబాద్‌, మే 25:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 12న నిర్వహించిన TS ECET 2025 (Telangana State Engineering Common Entrance Test) ఫలితాలు మే 25 (ఆదివారం) మధ్యాహ్నం 1 గంటకు విడుదలయ్యాయి. ఈ పరీక్ష ద్వారా బీఈ, బీటెక్‌, బీఫార్మసీ కోర్సులలో లేటరల్ ఎంట్రీ విధానంలో నేరుగా రెండో సంవత్సరంకి ప్రవేశాలు కల్పించనున్నారు.

ఈ సంవత్సరం మొత్తం 18,998 మంది విద్యార్థులు ఈసెట్ పరీక్షను రాశారు. పరీక్ష రాసిన విద్యార్థులు తమ ఫలితాలను దిగువ ఇచ్చిన డైరెక్ట్ లింక్ ద్వారా చూసుకోవచ్చు మరియు ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ ఫలితాలను ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అధికారికంగా విడుదల చేశారు.

ఈ సంవత్సరం మొత్తం 93.87% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ముఖ్యంగా మెటలర్జికల్ ఇంజినీరింగ్, బీఎస్సీ మ్యాథ్స్, ఫార్మసీ విభాగాల్లో 100% ఉత్తీర్ణత నమోదైంది. అన్ని విభాగాల్లో కూడా అమ్మాయిలే ఎక్కువగా ఉత్తీర్ణత సాధించారని ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి వెల్లడించారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book