TS EAMCET 2025: తెలంగాణలో వివిధ ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల

టీజీ ఈఏపీసెట్ మే 4 నుంచి 11 వరకు – ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి అధికారికంగా ప్రకటించింది. జేఎన్టీయూ ఆధ్వర్యంలో టీజీ ఈఏపీసెట్ (TG EAPCET) పరీక్షలను మే 4 నుంచి మే 11 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

టీజీ ఈఏపీసెట్ పరీక్షల షెడ్యూల్ ఇలా ఉంది:

  • మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్షలు

  • మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు

ఇతర ప్రవేశ పరీక్షల తేదీలు:

  • మే 12న టీజీ ఎడ్‌సెట్

  • మే 13, 14 తేదీల్లో టీజీ ఐసెట్

  • మే 15న టీజీ ఈసెట్

  • మే 18న టీజీ లాసెట్ మరియు పీజీ లాసెట్

  • మే 28 నుంచి 31 వరకు టీజీ పీజీ ఈసెట్

  • మే 31 నుంచి జూన్ 3 వరకు టీజీ పీఈసెట్

విద్యార్థులు తమ పరీక్ష తేదీలను గమనించి, ముందుగానే సన్నాహాలు చేసుకోవాలని అధికారులు సూచించారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book