నోటిఫికేషన్ అప్‌డేట్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) ఎగ్జామినేషన్ 2025 టైర్ 1 పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలతో లాగిన్ అయి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ముఖ్య వివరాలు
- పరీక్ష తేదీలు: సెప్టెంబర్ 12 నుంచి 26, 2025 వరకు
- పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
- పరీక్ష కేంద్రాలు: 129 నగరాల్లోని 260 కేంద్రాలు
- మొత్తం అభ్యర్థులు: 28,14,604 మంది హాజరు కానున్నారు