సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. ప్రయాణికులలో భయాందోళన

సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. పెను ప్రమాదం తప్పింది

తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్న సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్‌లో చిగిచెర్ల వద్ద పెను ప్రమాదం తప్పింది. రైలు వెనుక బోగీలోని చక్రాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బ్రేక్ బైండింగ్ సమస్య కారణమని అధికారులు గుర్తించారు. ఈ సమయంలో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

మంటలు గమనించిన గార్డు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయన సమాచారం మేరకు లోకో పైలట్ రైలును సురక్షితంగా ఆపాడు. అనంతరం గార్డు, సిబ్బంది కలిసి మంటలను అదుపు చేశారు. దాదాపు అరగంట పాటు రైలు అక్కడే నిలిచిపోయింది.

ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. తాత్కాలికంగా సమస్య పరిష్కరించి రైలు తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించింది. ప్రస్తుతం రైల్వే అధికారులు దీనిపై విచారణ చేపట్టారు


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book