శనివారం కర్ణాటకలో ఆర్ ఆర్ ఆర్ ( RRR )
ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండుగా నిర్వహించారు. ఈ ఈవెంటుకు కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై మరియు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ మాట్లాడుతూ పునీత్ రాజ్ కుమార్ తలచుకొని చాలా ఎమోషనల్ అయ్యారు . పునీత్ లేరన్న విషయాన్ని నమ్మలేకపొతున్నానన్నారు. శివన్న లోనే పునీత్ ను చేసుకుంటామన్నారు. ఎన్ టీ ఆర్ అభిమానులకు , రాం చరణ్ అభిమానలకు, ఈవెంటుకు విచ్చేసిన అందరికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసారు. ఆర్ ఆర్ ఆర్ ప్రయాణం ఓ మర్చిపోలేని అనుభూతని తన మాటల్లో రాం చరణ్ వెల్లడించారు. మార్చి 25 న మీ ముందుకు రాబోతుంది . మేము పడిన కష్టానికి ఫలితం దక్కబోతుందన్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు రాజమౌళికి , రాం చరణ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
RRR Pre Release Event Ram charan Speech
