RRB రైల్వే జాబ్స్ 2025: పారా మెడికల్ పోస్టుల కోసం నోటిఫికేషన్ – ఎంపికైతే లైఫ్ సెట్‌!

RRB రైల్వే జాబ్స్ 2025: పారా మెడికల్ పోస్టుల కోసం 434 ఖాళీల నోటిఫికేషన్ విడుదల

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) దేశ వ్యాప్తంగా ఉన్న రీజియన్లలో పారా మెడికల్ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 434 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్ 8, 2025 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు

  • నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ – 272 పోస్టులు
  • డయాలిసిస్‌ టెక్నీషియన్‌ – 4 పోస్టులు
  • హెల్త్‌ అండ్‌ మలేరియా ఇన్‌స్పెక్టర్‌ గ్రేడ్‌-2 – 33 పోస్టులు
  • ఫార్మసిస్ట్‌ (ఎంట్రీ గ్రేడ్‌) – 105 పోస్టులు
  • రేడియోగ్రాఫర్‌ ఎక్స్‌రే టెక్నీషియన్‌ – 4 పోస్టులు
  • ఈసీజీ టెక్నీషియన్‌ – 4 పోస్టులు
  • లాబొరేటరీ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2 – 12 పోస్టులు

అర్హతలు

ప్రతి పోస్టుకు అనుగుణంగా B.Sc Nursing, B.Sc, డిప్లొమా, 10+2, ఫార్మసీ, రేడియోగ్రఫీ, డిగ్రీ లేదా DMLTలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయోపరిమితి 

  • నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ – 20 నుంచి 40 ఏళ్లు
  • డయాలిసిస్‌ టెక్నీషియన్‌ – 20 నుంచి 33 ఏళ్లు
  • హెల్త్‌ అండ్‌ మలేరియా ఇన్‌స్పెక్టర్‌ – 18 నుంచి 33 ఏళ్లు
  • ఫార్మసిస్ట్‌ – 20 నుంచి 35 ఏళ్లు
  • రేడియోగ్రాఫర్‌ ఎక్స్‌రే టెక్నీషియన్‌ – 19 నుంచి 33 ఏళ్లు
  • ఈసీజీ టెక్నీషియన్‌ – 18 నుంచి 33 ఏళ్లు
  • లాబొరేటరీ అసిస్టెంట్‌ – 18 నుంచి 33 ఏళ్లు

దరఖాస్తు విధానం & ఫీజు

  • అప్లికేషన్‌ చివరి తేదీ: సెప్టెంబర్‌ 8, 2025
  • దరఖాస్తు ఫీజు:
  • జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌: రూ.500
  • ఎస్సీ/ఎస్టీ/మైనారిటీ/ఈబీసీ/పీడబ్ల్యూబీడీ/ఈఎస్‌ఎం/మహిళ/ట్రాన్స్‌జెండర్‌: రూ.250
  • సెప్టెంబర్‌ 11 నుంచి 20 వరకు దరఖాస్తు సవరణకు అవకాశం ఉంటుంది.

ఎంపిక విధానం

ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

 జీతభత్యాలు

  • నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ – ₹44,900
  • డయాలిసిస్‌ టెక్నీషియన్‌, హెల్త్‌ అండ్‌ మలేరియా ఇన్‌స్పెక్టర్‌ – ₹35,400
  • ఫార్మసిస్ట్‌, రేడియోగ్రాఫర్‌ ఎక్స్‌రే టెక్నీషియన్‌ – ₹29,200
  • ఈసీజీ టెక్నీషియన్‌ – ₹25,500
  • లాబొరేటరీ అసిస్టెంట్‌ – ₹21,700

Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book