ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 & గ్రేడ్ 3 పోస్టులు – దరఖాస్తు సవరణ గడువు ఆగస్ట్ 19 వరకు
దేశవ్యాప్తంగా రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 పోస్టుల దరఖాస్తు ప్రక్రియ పూర్తయింది. ఇప్పటికే దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో సవరణలు చేసుకునేందుకు ఆగస్ట్ 19, 2025 వరకు అవకాశం కల్పించినట్లు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ప్రకటించింది. ఆన్‌లైన్ దరఖాస్తులు ఆగస్ట్ 7తో ముగిశాయి. దరఖాస్తుల్లో తప్పులు ఉంటే ఆగస్ట్ 10 నుంచి సవరించుకునే అవకాశం ఇచ్చారు.
మొత్తం 6,238 టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 పోస్టులను దేశవ్యాప్తంగా భర్తీ చేయనున్నారు. ఎంపిక విధానం ఆన్‌లైన్ రాతపరీక్ష, మెడికల్ పరీక్షలు మరియు ఇతర దశల ఆధారంగా జరుగుతుంది. రాతపరీక్ష షెడ్యూల్‌ను త్వరలో ఆర్‌ఆర్‌బీ ప్రకటించనుంది.
తెలంగాణ బీ-కేటగిరీ ఇంజినీరింగ్ సీట్ల భర్తీ గడువు ఆగస్ట్ 18 వరకు పొడిగింపు
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీ-కేటగిరీ (యాజమాన్య కోటా) సీట్ల భర్తీ గడువును ఆగస్ట్ 18, 2025 వరకు పొడిగించింది. ముందు నిర్ణయించిన తుది తేదీ ఆగస్ట్ 10 కాగా, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో ఖాళీ సీట్ల ప్రత్యేక కౌన్సెలింగ్ కారణంగా గడువును పొడిగించారు. ఆయా కళాశాలలు ఆగస్ట్ 30, 2025లోపు భర్తీ అయిన విద్యార్థుల జాబితాను ఉన్నత విద్యామండలికి సమర్పించాలి.