RRB 2026 సవరించిన పరీక్ష తేదీలు: రైల్వే నియామక మండలి కొత్త షెడ్యూల్ విడుదల

RRB JE 2026 పరీక్ష తేదీలు సవరణ – కొత్త షెడ్యూల్ విడుదల

దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT 1) ఫిబ్రవరి 19, 20, 25 తేదీల్లో నిర్వహించనున్నట్లు ముందుగా ప్రకటించారు.

అయితే తాజాగా పరీక్ష షెడ్యూల్‌లో మార్పులు చేస్తున్నట్లు ఆర్‌ఆర్‌బీ ఫిబ్రవరి 10న ప్రకటించింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం CBT 1 పరీక్షలు ఫిబ్రవరి 19, 20, 25 తేదీల్లో నిర్వహించబడతాయి. మొత్తం 2,570 ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. పరీక్షకు 10 రోజుల ముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లు, పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులు విడుదల చేస్తారు.

ఇక తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న 859 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ హైకోర్టు (TGHC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు ఫిబ్రవరి 13, 2026తో ముగుస్తుంది. జనరల్, బీసీ అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ, ఈఎస్‌ఎం అభ్యర్థులు రూ.400 చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించాలి. అర్హత కలిగిన వారు గడువు లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book