RR defeat sunrisers hyderabad by 61 runs

నిన్న జరిగిన ఐపిఎల్ మ్యాచ్ సన్రైజర్స్ హైదరాబాద్ పై 61 పరుగుల తేడాతో బోణి కొట్టి పాయింట్స్ టేబుల్లో మొదటి స్థానంలో నిలిచింది రాజస్థాన్ రాయల్స్. పాయింట్స్ టేబుల్లో చివరి స్థానంలో నిలిచిన హైదరాబాద్. నెట్ రన్ రేటు కూడా మైనస్కి పడిపోయింది . తొలుత బాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్స్ నష్టానికి 210 పరుగులు చేసింది అదరహో అనిపించారు. హైదరాబాద్ 7 వికెట్స్ నష్టానికి 149 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేజించలేకపోయింది. రాజస్థాన్ రాయల్స్ క్యాప్టిన్ సంజుశాంసన్ 27 బాల్స్ కి 55 పరుగులు చేసి మాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. దేవాదత్ పడిక్కల్ 29 బాల్స్ కి 41 పరుగులు చేసాడు. ఓపెనర్గా దిగిన జాస్ బట్లర్ 28 బాల్స్ కి 35 పరుగులు చేసాడు. యుజేంద్ర చహల్ 3 వికెట్స్ తీసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ప్రసిద్ధ కృష్ణ , బౌల్ట్ తలో రెండు వికెట్స్ పడగొట్టారు. మొత్తనికి రాజస్థాన్ రాయల్స్ బోణి కొట్టి పాయింట్స్ టేబుల్లో మొదటి స్థానంలో నిలిచింది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book