ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్లు డిజైన్ కోసమే ప్రసిద్ధి చెందేవి – మెరిసే బ్యాక్, స్లిమ్ డిజైన్, గ్లాస్ ఫినిష్. కానీ, ఇప్పుడు కాలం మారింది. ఫోటోలు, వీడియోలతో ప్రపంచం కనబడేలా మారిపోయింది. అందుకే ఇప్పుడు కెమెరా ఒక ఫీచర్ కాదు, ప్రతి మధురమైన క్షణాన్ని క్యాప్చర్ చేసే హృదయంగా మారింది.
కెమెరాలు మెరుగుపడిన కొద్దీ, వినియోగదారుల అంచనాలు కూడా పెరిగాయి. కేవలం ఫోటో తీయడం కాదు, దాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం అయ్యింది. అదే సమయంలో AI టెక్నాలజీ వచ్చి, లైట్, స్కిన్ టోన్, ఫేస్ డిటెక్షన్, గ్లేర్ రిమూవల్, బ్లర్ ఫిక్స్ లాంటివి ఆటోమేటిక్‌గా చేస్తోంది. దీంతో ఫోటోలు న్యాచురల్‌గా, క్లారిటీగా కనిపిస్తున్నాయి.
జూలై 24న విడుదలవుతున్న రియల్‌మీ 15 సిరీస్, ఈ మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా రూపొందించబడింది. ఇందులో AI Edit Genie అనే వాయిస్ కంట్రోల్ ఎడిటర్ ఉంది (20+ భాషలలో పనిచేస్తుంది), AI Party Mode పార్టీ ఫోటోలకు వన్‌టచ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది, AI MagicGlow 2.0 మీ ఫోటోలోని ముఖాన్ని నేచురల్‌గా, అందంగా చూపిస్తుంది. రియల్‌మీ 15 ప్రోలో సోనీ IMX896 50MP ట్రిపుల్ కెమెరా, 4K 60FPS వీడియో రికార్డింగ్, AI స్టెబిలైజేషన్ లాంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇది ఫోటోగ్రఫీ, వీడియో షేర్ చేయడం, వ్లాగింగ్ లాంటి వాటికి ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుంది.