ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఆంధ్రాకింగ్’ సినిమా విడుదల తేదీలో కీలక మార్పు చోటుచేసుకుంది. ముందుగా నవంబర్ 28న థియేటర్లలో విడుదల చేయాలని ప్రకటించిన చిత్రబృందం, తాజా అప్‌డేట్‌తో రోజు ముందుగానే అంటే నవంబర్ 27న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించింది.
మహేశ్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రామ్ సరసన భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ప్రముఖ నటుడు ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించగా, ఆయన పాత్ర సినిమా హైలైట్‌గా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి.
విడుదల తేదీని ముందుకు తీసుకురావడంతో రామ్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఇటీవల కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో రామ్ ఈ సినిమాపై భారీగా నమ్మకాలు పెట్టుకున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు, పోస్టర్లు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో ‘ఆంధ్రాకింగ్’ రామ్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందన్న నమ్మకం పాకుతోంది.