నెదర్లాండ్స్ Vs నేపాల్: టీ20 క్రికెట్‌లో చారిత్రక ఘట్టం… రెండు సూపర్ ఓవర్లు టై… చివరికి విజయం ఎవరిది?

నెదర్లాండ్స్ vs నేపాల్: మూడు సూపర్ ఓవర్లకు వెళ్లిన అరుదైన టీ20 మ్యాచ్ – నెదర్లాండ్స్ ఘనవిజయం

గ్లాస్గో వేదికగా నెదర్లాండ్స్ మరియు నేపాల్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచింది. పురుషుల టీ20 క్రికెట్‌లో తొలిసారిగా ఒక మ్యాచ్ మూడు సూపర్ ఓవర్ల వరకు వెళ్లడం ఇది ప్రథమం.

మ్యాచ్ చివరి ఓవర్‌లో నేపాల్ విజయం కోసం 16 పరుగులు అవసరమవగా, నందన్ యాదవ్ అద్భుతంగా ఆడి మ్యాచ్‌ను టై చేశాడు. ఫలితంగా మ్యాచ్ మొదటి సూపర్ ఓవర్‌కు వెళ్లింది.

మొదటి సూపర్ ఓవర్‌లో ఇరు జట్లు 19 పరుగులు సాధించడంతో మ్యాచ్ రెండో సూపర్ ఓవర్‌కు వెళ్లింది. రెండో సూపర్ ఓవర్‌లో కూడా ఉత్కంఠ కొనసాగింది. నేపాల్ చివరి బంతికి 7 పరుగులు అవసరమవగా, భారీ సిక్సర్‌తో మళ్లీ స్కోరు సమమయ్యింది.

చివరకు మూడో సూపర్ ఓవర్‌లో నేపాల్ జట్టు ఒక్క పరుగు కూడా చేయలేకపోయింది. నెదర్లాండ్స్ బ్యాట్స్‌మన్ మైఖేల్ లెవిట్ తొలి బంతికే సిక్సర్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు.

ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు చారిత్రక అనుభూతిని అందించింది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book