‘కుబేర’పై చేసిన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చిన నాగార్జున
హైదరాబాద్‌లో జరిగిన ‘కుబేర’ సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా నటుడు నాగార్జున తన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. ఈ సినిమాపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన తెలిపారు.
దర్శకుడు శేఖర్ కమ్ముల కథ చెబుతున్న సమయంలోనే "దీపక్ పాత్ర చుట్టూ మిగతా పాత్రలు తిరుగుతాయి" అని చెప్పారు. అందుకే ప్రెస్ మీట్‌లో ఇది "తన సినిమా" అని అన్నానని నాగార్జున వివరించారు. అయితే, కొన్ని వక్రీకరణలు, మీమ్స్ వచ్చాయని, "ఇది శేఖర్ కమ్ముల సినిమా అన్నారు, ఇప్పుడు తనదంటున్నాడే" అని కొందరు అనడం తన దృష్టికొచ్చిందని తెలిపారు.
నిజానికి ఇది దేవా (ధనుష్), దీపక్ (తానే), సమీర (రష్మిక) పాత్రలతో పాటు, అందరూ కలిసి చేసిన సినిమా అని చెప్పారు. ముఖ్యంగా ఇది పూర్తిగా శేఖర్ కమ్ముల దర్సకత్వం లో వచ్చిన సినిమా అని స్పష్టంగా చెప్పారు. ఆయన దర్శకతనాన్ని నాగార్జున ఎంతగానో ప్రశంసించారు.