Nagalu pichhi Todikodallu

నగలు పిచ్చి తోడి కోడళ్ళు

ఒక ఇంట్లో గంగ , మంగ అనే తోడికోడళ్లు
ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి పడదు . ఒకరు నక్క తోక అంటే ఇంకొకరు కుక్క తోక అనే మాదిరిగా ఉంటారు . ఇద్దరికి నగల పిచ్చి బాగా ఉంది. ఒక రోజు
గంగ :- ఏవండి ఈ రోజు బయటికి వెల్దామా ? గంగ భర్త రాజు :- ఎందుకు గంగ పార్టీ ఏమైనా ఇస్తున్నవా ? ఏంటి ?
గంగ :- లేదు అండి . మన పెళ్ళి రోజుకు మంచి చీర కొనుక్కుంటా...
రాజు :- ఇప్పుడే కాదుగా పెళ్ళి రోజు దానికి చాలా సమయం ఉందిగా అప్పుడు కొనచ్చులే
అంటూ రాజు చెప్పి బయటికి వెళ్ళిపోతాడు .
మంగ భర్త రాము మంగకు చీర తీసుకొని ఇంటికి వస్తాడు...రాము :- మంగ ఎక్కడ ఉన్నావ్.. నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చా కనుక్కో..!!
మంగ :- అవునా నా మొగుడు బంగారం కాను అంటూ గిఫ్ట్ తీసుకొని చూస్తే దానిలో చీర ఉంటుంది... చీరను చూసి కోపంగా మొహం పెడుతూ :- అబ్బో ఏడిసినట్టు ఉంది మీ యవ్వారం...నగలు తీసురాకుండా
డొక్కులో ఒక చీర తీసుకొచ్చి గిఫ్ట్ అంటున్నారు ??
రాము :- నీ ఉద్దేశం ఏంటి అసలు నగలు తెస్తే ఒకలా తేకపోతే ఒకలా ?? చాలు చాలు వేషాలు బాగా ఎక్కువ అవుతున్నాయి... తగ్గించుకుంటే మంచిదని కోపంగా మాట్లాడి వెళ్ళిపోతాడు..
ఇలా మంగ , గంగ ఎవరి గదిలో వాళ్ళు బాధ పడుతూ ఉంటారు ..కొంత సేపటికి రాము , రాజు ఇద్దరు ఇంటికి వచ్చి హాల్లో ఇలా మాట్లాడుకుంటారు .
రాము :- ఒక పక్క వ్యాపారం బాగాలేదని మనం బాధ పడుతుంటే వీళ్లకి నగలు కావాలంట.. నగలు
రాజు :- అవును మా ఆవిడ కూడా.. ఆ టీవీలో వచ్చే సీరియల్ చూడటం ఆ నగలు ఈ నగలు అడగడం.. వీళ్లకి వేరే పని పాట ఏమి ఉండదు ?
వీళ్ళ మాటలను చాటుగా గంగ , మంగ వింటారు.. ఏమి తెలియనట్టు ఇద్దరు హాల్లోకి వచ్చి కూర్చోంటారు.
మంగ :- అందరూ ఒక దగ్గర ఉన్నాం కాబట్టి సరదాగా అంత్యాక్షరి ఆడుకోందాం. ఎవరు గెలిస్తే వాళ్ళకి నగలు బహుమతిగా ఇవ్వాలి ..
అప్పుడు వెంటనే రాము :- నగలు కోసం ఆడుతున్నావా లేక సరదా కోసం ఆడుతున్నావా అని అడుగుతాడు.. అబ్బే సరదా కోసమే అండి అంటూ ఆట మొదలు పెడతారు మొదటిగా మంగకి వస్తాది.
మంగ :- అబ్బో నాకే వచ్చిందిగా పాట పడతా..నగలు కొట్టేస్తా...
రాము :- సరేలే పాట పాడితే పాడు కానీ నువ్వు మాత్రం పడకు..
రాజు :- నువ్వు మాత్రం భలే జోకులు వేస్తావ్.
గంగ :- అబ్బో మీరు ఏమైనా తక్కువా..
రాజు :- గంగ ఇప్పుడు పాటలు ప్రోగ్రాంలో ఉన్నాం..
మనం తర్వాత జోకులు వేసుకుందాం..
రాము :- మంగ నువ్వు పాటలు బాగా పాడుతున్నావ్.. నగలు నీకెలే... కంగారు పడకు
మంగ :- ఏవండి.. నిజంగా నేను గెలుస్తానా...
రాము :- నువ్వు గెలవడానికే కదా ఇక్కడ ఈ ప్రోగ్రాం వంకతో నగలు బహుమతిగా పెట్టకున్నావ్..
మంగ :- ఏంటండి ..మీరు నన్ను పొగిడేస్తున్నారు..
రాము :- నిన్ను మింగ ...నీకు అలా అర్థం అయిందా..సరే లే..
రాజు :- నువ్వు ఎప్పుడూ తినడానికేనా...పాటలు పాడటం కూడా రాదా ?
గంగ :- హ మీరు నేర్పిస్తారని ??
ఇలా అందరూ వాదించుకుంటు ఉంటారు.. అంత్యాక్షరి ముగుస్తుంది.
మొత్తానికి మంగ అందరికంటే ఎక్కువ పాటలు పాడి నగలు సొంతం చేసుకుంటాది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book