A recent incident in Hyderabad caused consternation in the locality. If we go into the details.. Ram Mehto and Asha from Bihar are living in Panchsheela Colony of Kutubullapur Mandal in Hyderabad.
Both of them got married a year ago. Ram Mehto earns his living as a local bricklayer. As part of this work, Ram Mehta went to work as a laborer on Wednesday. When he came for lunch.. Asha did not open the door. When I noticed this at home, I saw that Asha was already hanging from the fan hook. After learning about the matter, the police reached the spot and started the investigation. It seems that Asha used to tell her neighbors that there was no child even after a year of marriage.
Because of this reason, the local people suspect that Asha, who was mentally depressed, committed the forced death. This news filled the local with great sadness. The locals think that they came to Batakadi from somewhere and took their lives here.
Telugu Version
తాజాగా హైదరాబాద్లో జరగిన ఓ సంఘటన స్థానికంగా దిగ్ర్భాంతిని కలిగించింది. వివరాల్లోకి వెళితే.. బిహార్కు చెందిన రామ్ మెహతో, ఆశ ఇద్దరు హైదరాబాద్లోని కుతుబుల్లాపూర్ మండలానికి చెందిన పంచశీల కాలనీలో నివాసం ఉంటున్నారు.
వీరిద్దరికి ఏడాది క్రితం వివాహం జరిగింది. రామ్ మెహతో స్థానికంగా తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే పనిలో భాగంగా రామ్ మెహతో బుధవారం కూలి పనికి వెళ్లాడు. మధ్యాహ్నం భోజనానికి రాగా.. ఆశ డోర్ తెరవలేదు. దీంతో ఇంట్లో గమనించగా ఆశ అప్పటికే ఫ్యాన్ హుక్కుకి చున్నీతో ఉరి వేసుకొని కనిపించింది. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. వివాహం జరిగి ఏడాది దాటుతున్నా సంతానం కలగడం లేదని ఆశ, ఇరుగు పొరుగు వారికి చెప్పుకుంటూ బాధపడేదని తెలుస్తోంది.
ఈ కారణంగానే మానసికంగా కృంగి పోయిన ఆశ.. బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ వార్త స్థానికంగా తీవ్ర విషాధాన్ని నింపింది. ఎక్కడో నుంచో బతకాడికి వచ్చి ఇక్కడ ప్రాణాలు తీసుకోవడం ఏంటని స్థానికులు అనుకుంటున్నారు.