లాజిటెక్: కొత్తరకం మౌస్ ను తీసుకువచ్చిన లాజిటెక్... ఇలాంటిది ఎక్కడా లేదు!

కంప్యూటర్ యాక్సెసరీస్ తయారీదారు లాజిటెక్ కొత్తరకం మౌస్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది రెగ్యులర్ గా కాస్త ఉబ్బెత్తుగా ఉండే మౌస్ మాదిరిగా కాకుండా, నిలువుగా కనిపిస్తుంది. అంటే వెర్టికల్ మౌస్ అన్నమాట. దీన్ని లాజిటెక్ 'ఎంఎక్స్ వెర్టికల్ మౌస్' పేరిట మార్కెట్లోకి రిలీజ్ చేసింది. దీని ప్రత్యేకమైన డిజైన్ ద్వారా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ఎక్కువసేపు డెస్క్‌ల వద్ద పనిచేసేవారికి ఇది కండరాల ఒత్తిడిని తగ్గిస్తుందని లాజిటెక్ చెబుతోంది. ఈ మౌస్ కుడిచేతి వాటం ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. అయితే ధర బాగా ఎక్కువే. దీని ధర ₹12,295. సాధారణ ఉద్యోగుల కంటే ప్రొఫెషనల్స్ కు ఇది బాగా ఉపయోగపడుతుంది. లాజిటెక్ MX వెర్టికల్ మౌస్ యొక్క ముఖ్యమైన అంశం దాని డిజైన్. దీని 57-డిగ్రీల కోణం మణికట్టుపై ఒత్తిడిని తగ్గిస్తుంది. పైభాగం రబ్బరు పూతతో ఉండడం వల్ల గట్టి పట్టు లభిస్తుంది.

మౌస్‌పై మొత్తం 5 బటన్లు ఉన్నాయి. వీటిని Logitech Options APP ద్వారా వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా మార్చుకోవచ్చు. ఈ యాప్ విండోస్, మాక్, ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ లలో కూడా పనిచేస్తుంది. బ్లూటూత్ లేదా USB-C కేబుల్ ద్వారా పరికరాలకు కనెక్ట్ చేయవచ్చు. బ్లూటూత్ లేని డెస్క్‌టాప్‌ల కోసం, లాజిటెక్ ఒక యూనివర్సల్ రిసీవర్‌ను అందిస్తుంది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book