ఇరాన్‌పై దాడులపై ఇజ్రాయెల్‌ను ఖండించిన 21 ముస్లిం దేశాలు

21 ముస్లిం దేశాల ఉమ్మడి ప్రకటన: ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించాలి

ఈజిప్ట్ చొరవతో 21 అరబ్, ముస్లిం దేశాలు ఇజ్రాయెల్‌ వాయు దాడులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోమవారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ చేసిన దాడులను ఖండిస్తూ, ప్రాదేశిక ఉద్రిక్తతలను తగ్గించాలన్నది వాటి ప్రధాన డిమాండ్. అణ్వస్త్రాల లేని ప్రాంతంగా మిడిల్ ఈస్ట్‌ మారాలనీ, అంతర్జాతీయ చట్టాలు, దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని ఈ దేశాలు కోరాయి.

ఈ ప్రకటన ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బదర్ అబ్దెలాటీ చొరవతో రూపొందించబడింది. తుర్కియే, జోర్డాన్, యూఏఈ, పాకిస్తాన్, బహ్రెయిన్, బ్రూనై, చాద్, గాంబియా, అల్జీరియా, జిబౌటి, సౌదీ అరేబియా, సూడాన్, సోమాలియా, ఇరాక్, ఒమన్, ఖతార్, కువైట్, లిబియా, ఈజిప్ట్, మౌరిటానియా దేశాలు ఈ ప్రకటనపై సంతకాలు చేశాయి.

వివాదాలను శాంతియుతంగా పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఈ ప్రకటన విడుదల కాగా, ఇజ్రాయెల్‌ తన వైమానిక దాడులను తక్షణమే ఆపాలని, సమగ్ర కాల్పుల విరమణ అమలవ్వాలని ముస్లిం దేశాలు స్పష్టంగా పేర్కొన్నాయి.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book