యాపిల్ కొత్తగా ఐఫోన్ 17 సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు మోడళ్లు ఉన్నాయి. ముఖ్యంగా ‘ఐఫోన్ ఎయిర్’ అతి పలుచని, తేలికైన మోడల్‌గా అందరినీ ఆకట్టుకుంటోంది. టైటానియం డిజైన్, సెరామిక్ షీల్డ్ 2 రక్షణ, 6.5 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, శక్తివంతమైన A19 ప్రో చిప్ ఇందులో ప్రత్యేకతలు.
ఐఫోన్ 17 మోడల్‌లో A19 చిప్, 6.3 అంగుళాల డిస్‌ప్లే, 48MP ఫ్యూజన్ డ్యుయల్ కెమెరా ఉన్నాయి. బ్యాటరీ పనితీరు కూడా మెరుగుపరచబడింది.
అధిక స్థాయి యూజర్ల కోసం ఐఫోన్ 17 ప్రో, ప్రో మ్యాక్స్ విడుదలయ్యాయి. వీటిలో 3 కెమెరాలు (48MP) మరియు 8x ఆప్టికల్ జూమ్ సదుపాయం కలదు. ప్రొఫెషనల్ వీడియో క్రియేటర్ల కోసం ప్రత్యేక ఫీచర్లు జోడించబడ్డాయి.
భారత్‌లో అమ్మకాలు: సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం, ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 12 నుంచి.
- iPhone 17 (256GB) – ₹82,900
- iPhone Air – ₹1,19,900
- iPhone 17 Pro – ₹1,34,900
- iPhone 17 Pro Max – ₹1,49,900