బేగంపేటలో హైడ్రా కూల్చివేతలు – అక్రమ నిర్మాణాల పైన చర్యలు

బేగంపేట–ప్యాట్నీ పరిధిలో హైడ్రా అధికారుల కొరడా చర్యలు

బేగంపేట–ప్యాట్నీ ప్రాంతంలో ఆక్రమణలపై హైడ్రా (HYDRA) అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. పాట్నీ నాలా పరివాహక ప్రాంతంలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించడం కోసం అధికారులు కంటోన్మెంట్ యంత్రాంగంతో కలిసి పనిలో ఉన్నారు.

నాలాను చేరువగా ఉన్న రెండు భవనాలను కూల్చివేశారు. గురువారం కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్యాట్నీ నాళాను పరిశీలించారు. అక్రమంగా ఆక్రమణలు జరుపుతున్నవారిపై తగిన చర్యలు తీసుకునే విషయమై స్పష్టమైన హామీ ఇచ్చారు.

ఈ ప్రక్రియలో శుక్రవారం ఉదయం హైడ్రా సిబ్బంది బుల్డోజర్లతో అక్కడికి చేరుకుని ఆక్రమణలను కూల్చివేశారు. స్థానికులు ప్యాట్నీ నాళా కుచుక్కోవడంతో వరదల సమయంలో నీరు కాలనీలు, ఇంటిల్లోకి ప్రవేశిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. అందుకే తాజాగా అధికారులు కూల్చివేతలను చేపట్టారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book