జీఎస్టీ సంస్కరణలు: కేంద్రం ప్రతిపాదన
దేశ పరోక్ష పన్నుల వ్యవస్థలో భారీ మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. జీఎస్టీ సంస్కరణలలో భాగంగా ప్రస్తుతం ఉన్న అనేక పన్ను శ్లాబుల స్థానంలో కేవలం రెండు మాత్రమే కొనసాగించాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది – 5% మరియు 18%.
-
5% శ్లాబు: ప్రస్తుతం 12% శ్లాబులో ఉన్న 99% వస్తువులను 5% పరిధిలోకి తీసుకురానున్నారు.
-
18% శ్లాబు: 28% శ్లాబులోని సుమారు 90% వస్తువులను 18% శ్లాబులోకి మార్చనున్నారు. దీంతో ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ వంటి గృహోపకరణాల ధరలు తగ్గే అవకాశం ఉంది.
-
ప్రత్యేక పన్ను: సిగరెట్లు, గుట్కా వంటి హానికరమైన వస్తువులపై 40% ప్రత్యేక పన్ను విధించనున్నారు. ఈ జాబితాలో కేవలం 5–7 వస్తువులు మాత్రమే ఉంటాయి.
-
మినహాయింపులు: పెట్రోల్ ఉత్పత్తులు జీఎస్టీ పరిధికి బయటే ఉంటాయి. వజ్రాలు, విలువైన రాళ్లపై పాత రేట్లే కొనసాగుతాయి.
సంస్కరణల ఉద్దేశ్యం:
ప్రస్తుతం జీఎస్టీ ఆదాయంలో 67% 18% శ్లాబ్ నుంచే వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. పన్ను రేట్లు తగ్గించడం ద్వారా వినియోగాన్ని పెంచి, ప్రజల కొనుగోలు శక్తిని బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పెరిగిన వినియోగం వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గదని అధికారులు అంచనా వేస్తున్నారు.
నిపుణుల అభిప్రాయం:
“ఈ మార్పులు సామాన్యులు, మధ్యతరగతి, రైతులు, మహిళలకు నేరుగా లాభం చేకూరుస్తాయి. అనేక నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయి” అని జీఎస్టీ నిపుణుడు వేద్ జైన్ అన్నారు.
ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో జీఎస్టీ మండలి సమావేశంలో తీసుకోనుంది. రాష్ట్రాల ఆర్థిక మంత్రుల ఆమోదం తర్వాతే కొత్త పన్ను విధానం అమల్లోకి వస్తుంది.