విశాఖలో గూగుల్ డేటా సెంటర్: రాష్ట్రంలోనే అతిపెద్ద సెంటర్ – 75 వేల కొత్త ఉద్యోగాలు రానున్నాయి!

విశాఖలో ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ | రూ.50 వేల కోట్ల పెట్టుబడితో 75 వేల ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నంలో గూగుల్‌ ఆసియా ఖండంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. సుమారు రూ.50 వేల కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్‌ హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్‌ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది అమెరికా వెలుపల గూగుల్‌ స్థాపించే అతిపెద్ద సెంటర్‌గా నిలవనుంది.

ఈ విషయాన్ని ఇన్వెస్ట్‌ ఇండియా ‘ఎక్స్‌’ (ట్విట్టర్‌)లో ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ దేశానికి డిజిటల్ హబ్‌గా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే కాకుండా, క్లౌడ్‌, సెర్చ్‌, యూట్యూబ్‌, ఏఐ సేవలు మరింత బలోపేతం కానున్నాయి.

ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో 75 వేలకుపైగా ఉద్యోగాలు రానున్నాయి. అందులో 25 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు, 50 వేల పరోక్ష ఉద్యోగాలు ఉండనున్నాయి. డేటా సెంటర్‌ కోసం గూగుల్ పునరుత్పాదక విద్యుత్ వినియోగించనుంది. సముద్ర తీరం వెంట చిన్న హైడ్రో ప్రాజెక్టులు ఏర్పాటు చేసి రూ.20 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది.

అంతర్జాతీయ కనెక్టివిటీ కోసం 3 సబ్‌మెరైన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు, డార్క్ ఫైబర్ నెట్‌వర్క్‌లు ఏర్పాటు చేయనున్నారు. శీతలీకరణ కోసం సముద్ర జలాన్ని వినియోగించనుండటంతో విశాఖ తీరాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం.

ఈ డేటా సెంటర్‌లో దేశానికి చెందిన విలువైన డేటా నిల్వ కానుండటంతో డేటా సెక్యూరిటీ మరింత బలపడనుంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ఐటీ రంగానికి విశాఖ కొత్త దిశ చూపనుంది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book