గోదావరి పుష్కరాలు: మంత్రుల కమిటీ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం – ఉత్తర్వులు జారీ

2027 గోదావరి పుష్కరాల కోసం ఏపీ ప్రభుత్వం మంత్రుల కమిటీ ఏర్పాటు

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12 మంది మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ కమిటీలో దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సభ్యులుగా నియమించబడ్డారు. దేవాదాయశాఖ కార్యదర్శి కమిటీకి మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.

ఈ మంత్రుల కమిటీ పుష్కరాల సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లను సమీక్షించడానికి, కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి బాధ్యత వహించనుంది. ఆయా శాఖల అధికారులు ఈ కమిటీకి అవసరమైన సహకారం అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book