ఏపీలో 17, తెలంగాణలో 8 పార్టీలను తొలగించిన ఎన్నికల సంఘం
- తెలంగాణలో జయప్రకాశ్ నారాయణ్ లోక్‌సత్తా పార్టీపై వేటు
- గత రెండు నెలల్లో మొత్తం 808 పార్టీల గుర్తింపు రద్దు
- క్రియాశీలకంగా లేకపోవడమే ప్రధాన కారణం
- దేశవ్యాప్తంగా 474 రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు
ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ్ స్థాపించిన లోక్‌సత్తా పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. తెలంగాణలో ఆ పార్టీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది.
గత రెండు నెలల్లో దేశవ్యాప్తంగా 808 పార్టీల రిజిస్ట్రేషన్ రద్దయింది. అందులో ఏపీలో 17, తెలంగాణలో 8 పార్టీలు ఉన్నాయి. ఎన్నికల్లో పాల్గొనకపోవడం, పార్టీ కార్యాలయ చిరునామా, ఆర్థిక లావాదేవీల వివరాలు సమర్పించకపోవడం వంటి కారణాలతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో రద్దయిన పార్టీలు:
ఆలిండియా ఆజాద్ పార్టీ, ఆలిండియా బీసీ ఓబీసీ పార్టీ, బీసీ భారతదేశం పార్టీ, భారత్ లేబర్ ప్రజాపార్టీ, లోక్‌సత్తా పార్టీ, మహాజన మండలి పార్టీ, నవభారత్ నేషనల్ పార్టీ, తెలంగాణ ప్రగతి సమితి.
ఏపీలో రద్దయిన పార్టీలు:
భారతీయ చైతన్య పార్టీ, జై సమైక్యాంధ్ర పార్టీ, రాయలసీమ పరిరక్షణ సమితి, ఆలిండియా లిబరల్ పార్టీ, భారత్ ప్రజా స్పందన పార్టీ, ఆలిండియా మంచి పార్టీ, భారతీయ సధర్మ సంస్థాపన పార్టీ, వెనుకబడిన వర్గాల మహిళా రైతు పార్టీ, వైఎస్‌ఆర్ బహుజన పార్టీ, గ్రేట్ ఇండియా పార్టీ, జై ఆంధ్రా పార్టీ, పేదరిక నిర్మూలన పార్టీ, పేదల పార్టీ, ప్రజాపాలన పార్టీ, సమైక్య తెలుగురాజ్యం పార్టీ, రాయలసీమ కాంగ్రెస్‌పార్టీ, పొలిటికల్ ఎసెన్షియల్ అండ్ యాక్యురేట్ కౌన్సిల్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్.