బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు 2025: ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల, నేటి నుంచి దరఖాస్తులు మొదలు

2025-26 బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలకు ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల

2025-26 విద్యా సంవత్సరానికి బీఎస్సీ నర్సింగ్ (నాలుగేళ్ల) కోర్సులో ప్రవేశాలు కోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని పలు నర్సింగ్ కళాశాలలలో కన్వీనర్, యాజమాన్య కోటా సీట్ల భర్తీకి సంబంధించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విజయవాడ ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ తెలిపింది.

దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా మే 28 నుంచి జూన్ 20, 2025 వరకు చేయవచ్చు. ఇతర వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా 90007 80707, 80082 50842 నంబర్లను సంప్రదించవచ్చు.

AP EAPCET 2025 పరీక్షలు ప్రశాంతంగా ముగింపు, ఫలితాలు త్వరలో విడుదల

ఆంధ్రప్రదేశ్‌ మొత్తం 8 రోజుల పాటు నిర్వహించిన AP EAPCET 2025 పరీక్షలు మే 27న విజయవంతంగా ముగిసినట్లు SET చైర్మన్, VC CSRK ప్రసాద్ తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,80,611 మంది దరఖాస్తు చేసి, 94.38% మంది హాజరు అయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 81,837 మంది దరఖాస్తు చేసి, 92.21% మంది హాజరు అయ్యారు. ఫలితాలు జూన్ 14న విడుదల కానున్నాయి.

తెలుగు విశ్వవిద్యాలయం 2025 MA తెలుగు ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం (గతంలో తెలుగు యూనివర్సిటీ) వరంగల్ ప్రాంగణంలోని జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో 2025-26 విద్యాసంవత్సరానికి MA తెలుగు కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పీఠాధిపతి గడ్డం వెంకన్న వెల్లడించారు.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా జూన్ 24 వరకు ఆలస్యం రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో జూన్ 30 వరకు దరఖాస్తులు అందుకుంటారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ల www.teluguuniversity.ac.in, www.pstucet.org ను చూడవచ్చు లేదా 99894 17299, 99891 39136 నంబర్లను సంప్రదించవచ్చు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book