ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)లో పలువురు ఉన్నతాధికారులకు పదోన్నతులు లభించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు రీజనల్ మేనేజర్లను (ఆర్‌ఎంలు) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా (ఈడీలు) ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటివరకు వీరంతా ఇన్‌ఛార్జి ఈడీలుగా పనిచేస్తుండగా, తాజా ఉత్తర్వులతో వారికి పూర్తిస్థాయి ఈడీ హోదా లభించింది. ప్రమోషన్ పొందిన వారిలో జి. విజయరత్నం (విజయవాడ జోన్), జీవీ రవివర్మ (పరిపాలన), టి. చెంగల్‌రెడ్డి (ఇంజినీరింగ్), పి. చంద్రశేఖర్ (కడప జోన్), ఎ. అప్పలరాజు (ఆపరేషన్స్), జి. నాగేంద్రప్రసాద్ (నెల్లూరు జోన్) ఉన్నారు.
అలాగే మరో 15 మంది సీనియర్ స్కేల్ అధికారులు స్పెషల్ స్కేల్ సర్వీస్ (ఆర్‌ఎం) కేడర్‌కు పదోన్నతులు పొందారు. ఈ నిర్ణయం ఏపీఎస్ఆర్టీసీ పరిపాలనను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.