రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహాలతో చెరువులు, జలాశయాలు నిండుకుండలా మారాయి. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా నీటి నిల్వలు నమోదయ్యాయి.
మొత్తం 38,628 చెరువులు ఉన్న రాష్ట్రంలో వీటి మొత్తం నిల్వ సామర్థ్యం 206.21 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 132.64 టీఎంసీల నీరు నిల్వ ఉంది — ఇది పదేళ్లలోనే రికార్డు స్థాయి. వీటిలో 19,685 చెరువులు 100%, 7,048 చెరువులు 75% పైగా నిండాయి.
కోస్తాంధ్రలో 26,487 చెరువుల్లో 85.85 టీఎంసీలు, రాయలసీమలో 12,141 చెరువుల్లో 46.79 టీఎంసీల నీరు ఉంది. నైరుతి రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో 849.70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ప్రధాన జలాశయాల్లో కలిపి ప్రస్తుతం 1004.48 టీఎంసీల నీరు ఉంది.
-
శ్రీశైలం: 97.32% (215.81 టీఎంసీ సామర్థ్యం)
-
నాగార్జునసాగర్: 99.81% (311.45 టీఎంసీలు) – ఎగువ నుంచి 46,305 క్యూసెక్కులు వస్తుండగా, 33,236 క్యూసెక్కులు పులిచింతలకు విడుదల
-
పులిచింతల: 97.42% (44.59 టీఎంసీలు)
-
ప్రకాశం బ్యారేజ్: పూర్తి స్థాయిలో (3.07 టీఎంసీలు), ఎగువ నుంచి వచ్చే 48,699 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల
మొత్తం మీద రాష్ట్రంలో జలవనరులు సమృద్ధిగా ఉండటంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.