ఏపీ విద్యుత్ శాఖలో 9,849 ఖాళీల భర్తీ – 75% పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, త్వరలో నోటిఫికేషన్
దశాబ్దం తర్వాత ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో భారీ నియామకాలకు మార్గం సుగమమైంది. రాష్ట్ర ప్రభుత్వం 9,849 ఖాళీల్లో 75% పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ఆదేశాలు త్వరలో జారీ కానున్నాయి.
నియామకాలు జరిగే పోస్టులు
ఈ నియామకాల్లో టెక్నికల్ & నాన్ టెక్నికల్ కేడర్ లో ఖాళీలు భర్తీ చేయనున్నారు:
-
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE)
-
అసిస్టెంట్ ఇంజనీర్ (AE) – సివిల్, ఎలక్ట్రికల్, టెలికాం, ఐటీ
-
జూనియర్ ఇంజనీర్లు
-
జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్
-
జూనియర్ అసిస్టెంట్లు
-
జూనియర్ లైన్‌మెన్
-
ఎనర్జీ అసిస్టెంట్లు (O&M విభాగం)
ఎందుకు ఖాళీలు పెరిగాయి?
పదవీ విరమణలు, పదోన్నతులతో ఖాళీలు పెరగడంతో పాటు, గత 5 ఏళ్లుగా నియామకాలు జరగకపోవడంతో సిబ్బంది రెండు విధులలో పని చేస్తున్నారు. ఫలితంగా ఉద్యోగులపై పని భారం పెరగడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటం జరిగింది.
2014లో తెదేపా ప్రభుత్వం కొంతమేర భర్తీలు చేసినా, కొత్త కూటమి ప్రభుత్వం ఇప్పుడు భారీ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం 40% వరకు పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యుత్ సంస్థలు సాంకేతికంగా బలహీనమవుతున్నాయని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
విద్యుత్ ప్లాంట్లలో సిబ్బంది కొరత
వీటీపీఎస్, కృష్ణపట్నంలో 800 మెగావాట్ల చొప్పున కొత్త థర్మల్ ప్లాంట్లు ఉత్పత్తిలోకి వచ్చినప్పటికీ సిబ్బంది నియామకం జరగలేదు. దీంతో సాంకేతిక సమస్యల పరిష్కారం ఆలస్యమవుతోంది. ఉద్యోగుల శిక్షణా కార్యక్రమాలు కూడా నిలిచిపోయాయి.
త్వరలో నోటిఫికేషన్
ప్రస్తుతం అత్యవసరంగా భర్తీ చేయాల్సిన పోస్టులపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. త్వరలో అధికారిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని సమాచారం.