అల్లు అర్జున్ కొత్త సినిమాలో విల్ స్మిత్?

అల్లు అర్జున్ తాజా చిత్రంలో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ నటించనున్నారని వార్తలు సినీ వర్గాల్లో హల్చల్ చేస్తున్నాయి. సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో, దర్శకుడు అట్లీ విల్ స్మిత్‌ను కీలక పాత్రకు తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం.

56 ఏళ్ల విల్ స్మిత్ ఓ ఆస్కార్ అవార్డు గ్రహీత మాత్రమే కాకుండా, ప్రముఖ నిర్మాత కూడా. ‘మెన్ ఇన్ బ్లాక్’ వంటి ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన సినిమాల ద్వారా ఆయన ప్రపంచ ఖ్యాతి పొందారు. ప్రస్తుతం, విల్ స్మిత్ సినిమాలను చాలా సెలెక్టివ్‌గా ఎంచుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో, అల్లు అర్జున్ చిత్రంలో ఆయనను నటింపజేయాలనే లక్ష్యంతో అట్లీ బృందం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందట. కానీ, ఇప్పటివరకు ఆయన ఈ ప్రాజెక్టులో భాగమవుతారో లేదో స్పష్టత లేదు. అట్లీ బృందం ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book