విశాఖలో అడుగుపెడుతున్న యాక్సెంచర్ | 12,000 ఐటీ ఉద్యోగాలు

ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రాబోతోంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్ కన్సల్టెన్సీ సంస్థ యాక్సెంచర్ వైజాగ్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతోంది. భారీ క్యాంపస్ ఏర్పాటు చేసి, 12,000 మందికి ఉపాధి కల్పించాలని ప్రతిపాదన ఇచ్చింది. ఇందుకోసం 10 ఎకరాల భూమిని ఎకరాకు 99 పైసల నామమాత్రపు లీజుకి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది, రాయిటర్స్ తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా 7.9 లక్షల మంది ఉద్యోగులతో కార్యకలాపాలు కొనసాగిస్తున్న యాక్సెంచర్‌లో దాదాపు 3 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. విశాఖకు రాకపోవడం స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పెరగడానికి, అనుబంధ రంగాల అభివృద్ధికి దోహదం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

విశాఖలో ఇతర కంపెనీలు

యాక్సెంచర్ మాత్రమే కాకుండా, ఇప్పటికే టీసీఎస్ రూ.1,370 కోట్ల పెట్టుబడితో 12,000 ఉద్యోగాలు కల్పిస్తుందని ప్రకటించింది. IT హిల్ నంబరు-3లో 21.6 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. మరో దిగ్గజం కాగ్నిజెంట్ కూడా కాపులుప్పాడలో క్యాంపస్ ఏర్పాటు చేసి, రూ.1,582.98 కోట్ల పెట్టుబడితో 8,000 మందికి ఉపాధి కల్పించనుంది, భూమి కూడా నామమాత్రపు లీజుకు అందించారు.

ఆకర్షిస్తున్న ఐటీ పాలసీ

కోవిడ్ తర్వాత, IT కంపెనీలు బెంగళూరు, హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల బదులు విశాఖ వంటి ద్వితీయ నగరాలను ప్రాధాన్యం ఇస్తున్నాయి. తక్కువ ధరకే భూములు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, తక్కువ ట్రాఫిక్ వంటి అంశాలు ప్రధాన కారణాలు. అలాగే, ఏపీ కొత్త IT పాలసీ, భారీ ఉద్యోగాలను కల్పించే సంస్థలకు నామమాత్రపు భూమి కేటాయించడం తదితర హెల్ప్‌లు కంపెనీలను ఆకర్షిస్తున్నాయి.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book