Latest Updates

చిరంజీవి: ‘ఖైదీ’కి 42 ఏళ్లు

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన “ఖైదీ” చిత్రానికి ఈరోజు (అక్టోబర్ 28)తో 42 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా చిరంజీవి టీమ్ విడుదల చేసిన స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “తెలుగు సినిమా చరిత్రలో మార్పు తీసుకొచ్చిన పేరు ఖైదీ” అనే లైన్‌తో ప్రారంభమైన ఈ వీడియో అభిమానులను 1980ల జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తోంది.

హాలీవుడ్ “ఫస్ట్ బ్లడ్” స్ఫూర్తితో రూపొందిన ఖైదీ, అప్పట్లో రూ. 4 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డు సృష్టించింది. కేవలం ₹25 లక్షల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, 20 కేంద్రాల్లో 100 రోజులు, 2 కేంద్రాల్లో 365 రోజులు ప్రదర్శించబడింది.

మొదట ఈ కథను సూపర్‌స్టార్ కృష్ణ కోసం రాసినా, చివరికి చిరంజీవిని వరించింది. దర్శకుడిగా ఎ. కోదండరామిరెడ్డి, కథా సంభాషణలు పరుచూరి బ్రదర్స్ అందించారు. ఈ చిత్రం చిరంజీవిని స్టార్‌డమ్ శిఖరాలకు తీసుకెళ్లిన “టర్నింగ్ పాయింట్”గా నిలిచింది.

తెలుగు సినిమా చరిత్రలో మాస్ సినిమాలకు కొత్త మార్గం చూపిన ఈ “ఖైదీ” ఈ రోజు కూడా కల్ట్ క్లాసిక్గానే గుర్తించబడుతోంది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book