తిరుమల వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు – నేటి నుంచి అమలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు చేసినట్లు ప్రకటించింది. ఈ కొత్త సమయాలు నేటి నుంచి ప్రయోగాత్మకంగా అమలులోకి వస్తాయి. డిప్యూటీ ఈఓ లోకనాథం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉదయం 5:45 గంటల నుంచి 11:00 గంటల వరకు బ్రేక్ దర్శనం కొనసాగుతుంది. అయితే గురువారం (తిరుప్పావడ సేవ) మరియు శుక్రవారం (అభిషేక సేవ) రోజులలో పాత సమయాల ప్రకారమే దర్శనం జరుగుతుంది.
కొత్త షెడ్యూల్ ప్రకారం:
-
ఉదయం 5:45 – ప్రొటోకాల్ దర్శనం
-
6:30 – రిఫరల్ ప్రొటోకాల్
-
6:45 – జనరల్ బ్రేక్ దర్శనం
-
10:15 – శ్రీవాణి (ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్)
-
10:30 – దాతలు
-
11:00 – టీటీడీ రిటైర్డ్ ఉద్యోగులు
గురువారం, శుక్రవారం ఉదయం 8 గంటలకు బ్రేక్ దర్శనం ప్రారంభమవుతుంది. భక్తులు ఈ మార్పులను గమనించి, తగిన విధంగా తమ దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.